లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత : షర్మిల ఆఫీస్ ముట్టడి

-

వైఎస్ షర్మిలకు సీమాంధ్ర నేతల నుంచి సెగ తగిలింది. ఆమె ఇవాళ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కొత్తగా రాబోతున్న తన పార్టీ  కోసం కేడర్ ను సమకూర్చుకునేందుకు teamyssr పేరుతో కొత్త వెబ్ సైట్ ను లాంచ్ చేశారు. ఇక నుంచి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఆ వెబ్ సైట్ లో వారి వివరాలు ఇవ్వాలని కోరారు. తద్వారా తెలంగాణలో అధికారంలోకి రావడమేకాదు ఆమె సిఎం కావాలన్న ఉద్దేశంతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. వెబ్ సైట్ పేరులో కూడా అది ప్రస్పుటించింది. టీమ్ వైఎస్ఎస్ఆర్ అంటే టీమ్ వైఎస్ షర్మిలా రెడ్డి అని అర్థం వచ్చేలా పేరును ఖరారు చేశారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో నిన్నమొన్న షర్మిల తెలంగాణకు అనుకూలంగా, సీమాంధ్రకు వ్యతిరేకంగా కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు. చుక్క నీరు కూడా వదులుకోం అంటూ గంభీరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అవసరమైతే దీనిపై ఎవరితోనైనా పోరాటానికి సిద్ధమే అని నేరుగా జగన్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. దీంతో ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి ఛైర్మెన్ కొలికపుడి శ్రీనివాస్ చలో లోటస్ పాండ్ కు పిలుపునిచ్చారు. వారు వారి సభ్యులు లోటస్ పాండ్ లోని షర్మిల ఆఫీసును ముట్టడించారు. సీమాంధ్రకు వ్యతిరేకంగా, సీమ రైతుల నోట్లో మట్టి కొట్టేలా ప్రకటనలు చేస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ సమయంలో షర్మిల పార్టీ అనుచరులకు, రైతు సంఘం నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇందిరా శోభన్ లాంటి నాయకులు సీమాంధ్ర నేతలతో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు లోటస్ పాండ్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అనంతరం బంజారాహిల్స్ పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. కొలికపూడి శ్రీనివాస్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకారులను అక్కడినుంచి వెల్లగొట్టడంతో వివాదం సద్దుమణిగింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...