ఘోర ప్రమాదం..45 మంది సజీవదహనం

Terrible accident..45 people burnt alive

0
131

బల్గేరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో 45 మంది ప్రయాణికులు అగ్నికి సజీవ దహనమయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఏడుగురు ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన అక్కడి పోలీసులు సాంకేతిక లోపంతో జరిగిందా? లేక డ్రైవర్‌ తప్పిదమా? అనే రెండు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. ఈ దుర్ఘటనపై బల్గేరియా ప్రధానమంత్రి స్టీఫెన్‌ యానెవ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.