యాదాద్రి భువనగిరి జిల్లాలో డీసీఎం, ద్విచక్రవాహనం ఢీ..ముగ్గురు స్పాట్ డెడ్

0
116

ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. డీసీఎం, ద్విచక్రవాహనం ఒక్కసారిగా ఢీకొనడంతో ముగ్గురు ఎక్కడిక్కడే  మృతిచెందిన ఘటన వనగిరి మండలం హన్మాపురం వద్ద చోటుచేసుకుంది.

అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆ తరువాత మృతదేహాలను పరిశీలించి ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్టు ప్రాధమికంగా నిర్దారించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలేంటనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.