ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు స్పాట్ డెడ్

0
153

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా కడప జిల్లా మైలవరం వద్ద జరిగిన ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వస్తుంది. వేగంగా వస్తున్న కారు చూసుకోకుండా ఆగివున్న ఉన్న లారీని వెనుకనుంచి ఢీ కొనడంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..కారు డ్రైవర్‌తో పాటు ఓ చిన్నారికి గాయాలయ్యాయి.

అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టి డ్రైవర్‌తో పాటు ఓ చిన్నారికి సమీప ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిని  వెంకటసుబ్బయ్య, లక్ష్మీ మునెమ్మ, వెంకట సుబ్బమ్మలుగా పోలీసులు గుర్తించి..వారి స్వగ్రామం అయినా మైలవరం మండలం దోమ నంద్యాల గ్రామానికి తరలించారు.