ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్

0
139

ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై గుట్టపల్లి సమీపంలో కారును వెనకనుంచి లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డ ఈ ఘటన అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గుట్టపల్లి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదాన్ని గమనించిన కొందరు స్థానికులు గాయపడిన పడిన వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.