మహేష్ ఫాన్స్ కు గుడ్ న్యూస్..’మురారి వా’ సాంగ్ రిలీజ్ (వీడియో)

0
46

స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” గురువారం థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను అబ్బురపరిచింది. నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదలయి పాజిటివ్ టాకుతో దూసుకుపోతుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమాలో మహేష్ యూఎస్ లో ఓ బ్యాంక్‌ లో రికవరీ ఎంప్లాయ్‌గా కొత్త లుక్ లో కనపడి అభిమానులను ఖుషి చేసాడు. ఈ సినిమా మంచి కల్లెక్షన్స్ తో జోరు చూపించగా..తాజాగా ఎడిటింగ్‌లో తొలగించిన ‘మురారి వా’ అనే మెలోడియ‌స్ సాంగ్‌ను యాడ్ చేశారు చిత్రబృందం.

అయితే ఈ పాటకు సంబంధించి బిగ్ అప్డేట్ వదిలింది చిత్రబృందం. మురారి వా’ పాట ఫుల్ వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేసారు. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాగా..కీర్తి సురేశ్ పాటకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ పాట ప్రేక్షకులను ఈలలు వేసేలా చేయడంతో పాటు స్టెప్పులేసెలా కూడా చేసింది.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://youtu.be/tCI5wz2rEbY