పెళ్లికి ఒప్పుకోలేదని ఇంట్లో గంజాయితో ఎంత పెద్ద స్కెచ్ వేశాడంటే

That’s how big a sketch he put up with marijuana at home that didn’t agree to marriage

0
111

ఇటీవల వన్ సైడ్ లవ్ లు ఎక్కువ అవుతున్నాయి. అవతల వారి ప్రేమకి అభిప్రాయానికి వీరు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ప్రేమని నిరాకరిస్తే ఏకంగా చంపడమో లేదా వారిపై దాడి చేయడమో చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ ఆస్పత్రి సీఈవో చేసిన పని అందరిని షాక్ కి గురి చేసింది. తనతో పెళ్లికి నిరాకరించిందన్న కక్షతో మహిళా పారిశ్రామిక వేత్త ఇంటిలో గంజాయి పెట్టించాడు ఆ వ్యక్తి. అసలు ఈ కేసు ఏమిటో చూద్దాం.

కేరళ రాష్ట్రానికి చెందిన మహిళా వ్యాపారవేత్త శోభా విశ్వనాథ్ కు తిరువనంతపురంలోని లార్డ్స్ ఆసుపత్రి సీఈవో హరీశ్ హరిదాస్తో పరిచయమైంది. ఇక ఈ పరిచయంతో ఆమెని పెళ్లి చేసుకోమని కోరాడు. ఆమె నో చెప్పింది, దీంతో ఆమెని ఎలాగైనా ఇరికించాలి అని ఆమె ఇంట్లో పని చేసే వివేక్రాజ్ అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు. వివేక్ సాయంతో శోభ ఇంటి లోపల హరీశ్ గంజాయి పెట్టించాడు.

తర్వాత తనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.అయితే ఆమె ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లింది. లోతైన విచారణ చేస్తే అసలు విషయం బయటపడింది.శోభను నిర్దోషిగా తేల్చిన పోలీసులు హరీశ్, వివేక్లను నిందితులుగా చేర్చారు. చూశారుగా ఇలా ఉన్నారు కొందరు దుర్మార్గులు.