రాజకీయాల్లో విజయాలు సాధించిన మన హీరోయిన్స్ వీరే

These are our heroines who have achieved success in politics

0
51

రాజకీయాల్లో సినిమా నటులు ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో తెలిసిందే. ముందు సినిమాల్లో నటించి తర్వాత రాజకీయాల్లో చక్రం తిప్పిన వారు ఎందరో ఉన్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే హీరోలే కాదు హీరోయిన్లు కూడా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి, తమ అదృష్టం పరీక్షించుకుని, ఉన్నత పదవులు చేపట్టారు. మరి అలాంటి హీరోయిన్స్ ఎవరు అనేది చూద్దాం.

1.ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయలలిత. సినిమాల తర్వాత ఆమె రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. తమిళనాట అమ్మగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా ఎంతో పేరు సంపాదించారు జయలలిత.

2.నటి జయప్రద ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీలో చేరారు. 1996లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత యుపిలో సమాజ్ వాదీ పార్టీలో చేరి, 2004లో రామ్ పూర్ నుంచి లోక్ సభకు ఎన్ని
కయ్యారు.

3.లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 1998లో బీజేపీలో చేరి, తర్వాత బయటకు వచ్చి, తల్లి తెలంగాణ పేరిట పార్టీ పెట్టారు, తర్వాత కాంగ్రెస్ లో చేరారు, ఇక ఇటీవల మళ్లీ బీజేపీలో చేరారు.

4. హీరోయిన్ రోజా ముందు టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు సార్లు నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

5. స్టార్ హీరోయిన్ నగ్మా 2014లో కాంగ్రెస్ తరపున మీరట్ నుంచి పోటీచేసి ఓడిపోయారు.

6. నవనీత్ కౌర్ 2019లో ఎంపీగా గెలిచారు.

6.నటి సుమలత కర్ణాటక మండ్య లోక్ సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

7. సహజ నటి జయసుధ, 2009లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున పోటీచేసి గెలిచారు.