వారిద్దరూ పెళ్లి చేసుకుని 8 ఏళ్ల తర్వాత గ్రామం వచ్చారు – ఆమె తండ్రి ఎంత దారుణం చేశాడంటే

That’s how cruel her father was

0
128

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు ఏమి అనలేదు. ఇలా ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. ఆ జంట సంతోషంగా ముంబైలో ఉంటున్నారు. ఇటీవల తమ సొంత గ్రామం వచ్చారు ఈ జంట. అదే వారి ఇంట విషాదమైంది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థ్ నగర్ జిల్లా చిల్లియా ప్రాంతంలోని ఖల్సా గ్రామానికి చెందిన విశ్వనాథ్ శర్మకు సునీతా శర్మ అనే 28 ఏళ్ల కుమార్తె ఉంది. అబ్దుల్ అనే యువకుడిని ప్రేమించింది. చివరకు 8 ఏళ్ల క్రితం ఇద్దరు పారిపోయి వివాహం చేసుకున్నారు.

అబ్దుల్, సునీతా శర్మ ముంబైలోనే జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇటీవల తమ గ్రామానికి వచ్చారు ఇద్దరూ.మూడు వారాల పాటు గ్రామంలోనే ఉన్నారు. భార్యాపిల్లలను తన తండ్రి ఇంట్లోనే ఉంచి వారం రోజుల్లో వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు, ఈ సమయంలో ఆమె తండ్రి ఇంటికి వచ్చి అతన్ని వదిలెయ్యమని కోరాడు. ఆమె మాత్రం నో చెప్పింది. ఇటీవల మరోసారి అడిగాడు ఆమె భర్తని వదలను అని చెప్పింది. దీంతో పక్కన ఉన్న రాయిని తీసుకుని ఆమె తలపై కొట్టి కన్న తండ్రే చంపేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ తండ్రిని అరెస్ట్ చేశారు.