మూత్రంలో మంట వస్తోందా ఈ తప్పులు చేయకండి

Do not make these mistakes if you have inflammation in the urine

0
64

మనం తాగే నీరు మన ఆరోగ్యం కూడా చెబుతుంది. ఎంత నీరు తాగితే అంత మంచిది. ముఖ్యంగా రోజుకి నాలుగు లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. నీటిని తక్కువగా తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. కొందరిలో వేడి అలాగే జలుబు చేస్తుంది. మరికొందరికి నీటిని తక్కువగా తీసుకోవడం ద్వారా అటు మూత్రంలో మంట లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

ఇక వారికి మూత్రం వస్తే ఎంతో బాధగా ఉంటుంది. ఓ పక్క మంట మరో పక్క మూత్రం ఆపుకోలేరు. ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.చిన్న చిట్కాలతో నొప్పిని దూరం చేసుకోవచ్చు అని చెబుతున్నారు వైద్యులు. ఇలా మూత్రం లో మంట సమస్యతో బాధపడుతుంటే ఎక్కువగా నీళ్లు తాగుతూ మూత్ర విసర్జన చేయడం వల్ల నొప్పి తగ్గుతుందట.

చాలా మంది మూత్రంలో మంట వచ్చేవారు ఎక్కువగా నీరు తాగరు. ఇలాంటి వారికి పచ్చగా మూత్రం రావడం అలాగే ఎక్కువ మంట నొప్పి వస్తుంది. ఇలాంటి సమస్య ఉంటే మసాలా ఫుడ్ కి దూరంగా ఉండటం మంచిది .బలవంతంగా మూత్రాన్ని ఆపుకోవద్దు.ఎండలో ఎక్కువ తిరగద్దు. శరీరానికి చలువ చేసే ఫుడ్ మాత్రమే తీసుకోవాలి.