సింహాల బారి నుంచి పిల్లని కాపాడుకున్న గేదె – వీడియో చూడండి

The buffalo that saved the baby from the clutches of the lions- viral video

0
117

తల్లి పిల్లలపై చూపించే ప్రేమ కేరింగ్ ఈ ప్రపంచంలో మరెవరూ చూపించరు. అది మనుషులు అయినా జంతువులు అయినా పిల్లలపై అంతే ప్రేమ చూపిస్తాయి. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి తన బిడ్డకి హాని తలబెడితే ఎవరిని వదలదు. ఇక అడవిలో అయితే అనేక మృగాలు సాధు జంతువులపై తమ ప్రతాపం చూపిస్తాయి. వాటికి అవే ఆహారం.

 

వేటాడి వెంటాడి మరీ చంపుతాయి. ఇక అడవిలో ఇలాంటివి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాని ఇక్కడ తన బిడ్డని సింహాల నుంచి రక్షించుకుంది ఓ తల్లి.

ఓ గేదె తన బిడ్డతో కలిసి వెళుతుండగా అనూహ్యంగా ఆరు సింహాలు వాటిపై దాడికి దిగుతాయి. వెంటనే తన బిడ్డని తీసుకుపోతున్న సింహాన్ని వెంటాడి మరీ ఆ బిడ్డ ప్రాణాలు రక్షించుకుంటుంది. కొన్ని సెకన్లు ఆలస్యం చేసినా ఆ బిడ్డని ఆ గుంపు చంపేసేది. ఆ దైర్యం తెగింపుతో తన బిడ్డ ప్రాణాలు రక్షించుకుంది ఆ గేదె. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వీడియో ఇదే https://twitter.com/i/status/1402287919134478345