Flash: బ్యాంకు ఆఫ్​ బరోడాలో చోరీకి పాల్పడిన క్యాషియర్..

0
125

బ్యాంకు ఆఫ్​ బరోడాలో ఓ క్యాషియర్ చేసిన పనికి అందరు షాక్ అయ్యారు. హైదరాబాద్​ వనస్థలిపురంలోని బ్యాంకు ఆఫ్​ బరోడాలో 22.53 లక్షల నగదు మాయం అవ్వడంతో అధికారులు ఎవరు చేశారనే కోణంలో తీవ్రంగా గాలిస్తున్న క్రమంలో క్యాషియర్ ప్రవీణ్​​పై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దొంగతనం జరిగిన మరోసటి రోజు నుండి క్యాషియర్ కనబడకుండా తిరుగుతుండడంతో అతనే డబ్బు ఎత్తుకెళ్లి ఉంటాడని అధికారులు యోచిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. క్యాషియర్​ ప్రవీణ్​ ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు నిర్దారించారు. మంగళవారం మధ్యాహ్నం రూ.22.53 లక్షలు డబ్బు తీసుకుని పారిపోయినట్లు పోలీసులు అధికారులకు తెలిపారు.