వరుడు తాళికట్టే సమయంలో ఫుల్లుగా తాగాడు – చివరకు వధువు ఏం చేసిందంటే

The groom drank heavily during the marriage

0
127

 

పెళ్లి అంటే మాములు సందడి ఉండదు. ఇక వరుడు ఫ్రెండ్స్ అక్కడ చేసే హంగామా, సందడి ఎలా ఉంటుందో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. అయితే పెళ్లి రోజు పెళ్లికొడుక్కి మందు తాగించడం కొందరు చేస్తూ ఉంటారు. అయితే ఇది పెద్దగా పట్టించుకోని కుటుంబాలు ఉంటాయి. కుర్రాళ్ల సరదా అనుకుంటారు. కానీ దీనిని బాగా సీరియస్ గా తీసుకునే అమ్మాయిలు ఉంటారు.ఇక్కడ అదే జరిగింది.

ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో ఓ 22 ఏళ్ల యువతి పెళ్లికి నిరాకరించింది. అబ్బాయి పెళ్లికి మరో 20 నిమిషాల సమయం ఉందనగా ఫుల్లుగా తాగాడు. ఇక అతని పక్కన ఆమె కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పడింది. అయితే సరదాగా ఫ్రెండ్స్ తాగమన్నారు అందుకే తాగాను అన్నాడు.

పెళ్లికి ఇలా తాగినోడు రేపు ఇంకెలా ఉంటాడో అని నేను పెళ్లి చేసుకోను అని చెప్పింది. అంతేకాదు నా తండ్రి పెళ్లికి ఇచ్చిన కట్నం ఖర్చు అంతా ఇవ్వాలి. లేకపోతే కేసు పెడతానంది. మొత్తానికి పెద్దలు వచ్చి నచ్చచెప్పినా ఆమె వినలేదు. దీంతో ఒప్పందం ప్రకారం కొంత నగదు ఆమెకిచ్చారు. అప్పుడు ఆమె పెళ్లికొడుకు ఫ్యామిలీని అక్కడ నుంచి వెళ్లనిచ్చింది. మందు చివరకు ఇంత పని చేసింది.