హోటల్ యజమాని కర్కశత్వం..యువకుని శరీరం ఛిద్రం

0
102

పేదరికంలో ఉన్న యువకులు చదువుకోలేక ఏదో ఒక పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. కొందరు షాపుల్లో, మరికొందరు వ్యవసాయ కూలీలుగా, ఇంకొందరు హోటల్ లో పని చేస్తుంటారు. పని చేస్తున్న క్రమంలో నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సరిగా పని చేయకపోతే యజమాని మందలిస్తాడు. లేదంటే పనిలో నుండి తీసేస్తాడు. తెలంగాణలోని ఓ హోటల్ లో పని చేసే యువకునికి ఆ హోటల్ నరకం అయింది. యజమాని యముడయ్యాడు.

ఆ టిఫిన్ సెంటర్ యాజమాని తన కింద పని చేసే యువకుడి పట్ల కర్కశత్వం ప్రదర్శించాడు. యువకుడిని కట్టు బానిసను చేసి శరీరాన్ని నుజ్జు నుజ్జు చేస్తున్నాడు. తట్టుకోలేని యువకుడు స్నేహితుల సహాయంతో రాచకొండ కమీషనరేట్ కార్యాలయానికి వెల్లడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అమానవీయ ఘటన కాప్రా మున్సిపాలిటికి చెందిన జమ్మిగడ్డలో చోటు చేసుకుంది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..పవన్ కుమార్ అలియాస్ భీమ్ అనే తండ్రి లేని నిరుపేద యువకుడితో అనిల్ అనే వ్యక్తి జమ్మిగడ్డలో వున్న తన హాటల్ లో కొన్ని సంవత్సరాల నుండి బానిసను చేసి పని చేయించుకుంటున్నాడు. ఆ హోటల్ లో పవన్ పని చేసేవాడు అనడం కంటే అనిల్ చేతుల్లో నరకయాతన అనుభవిస్తున్న కట్టు బానిస అనడమే వాస్తవం.

ప్రతి చిన్న విషయానికి చితకబాదుతూ..శరీరం మొత్తం ఛిద్రం అయ్యేలా చేతికందిన దానితో దాడి చేస్తూ పని చేయించుకుంటున్నారు. పని ఆలస్యమైన, కారణం చెప్పిన, ప్రశ్నించిన, పనికి రాకున్న ఇలా ఒక్కటి కాదు ప్రతి చిన్న విషయానికి గొడ్డును బాదినట్టు బాదడంతో యువకుడి శరీరం ముక్కలు ముక్కలు అవడం ఒక్కటే తక్కువైనట్టు నుజ్జు నుజ్జు అయిపోయింది. ఏండ్ల తరబడి తరచూ కొడుతుండడంతో శరీరంలో గాయాలు లేని స్థలం వెతికిన దొరకని పరిస్థితి.. ఆ యువకుడి శరీరాన్ని చూస్తే మనసు ఉద్వేగంతో చలించకమానదు.

హోటల్ యాజమాని అనిల్ పెట్టే టార్చర్ భరించలేక గతంలో పని మానేసి వెల్లిపోయినందుకు బంగారం దొంగతనం చేసాడని పోలీసులకు అబద్దపు ఫిర్యాదు చేసి బెదిరించి మళ్ళీ పనిలోకి బలవంతంగా తీసుకెల్లాడని..దెబ్బలు భరించలేక పోలీసులని ఆశ్రయించామని బాధితుడు ఆరోపణ చేస్తున్నాడు.