చెట్ల దగ్గర పుట్టల్లో ఉండాల్సిన పాములు ఇప్పుడు ఇళ్లల్లోకి కూడా వస్తున్నాయి. ఇక అవి విషపు పాములు ఏమో కరిస్తే ఇక అంతే అని భయపడి వాటిని కొందరు చంపేస్తున్నారు. మరికొందరు పాములు పట్టేవారికి సమాచారం ఇస్తున్నారు. అయితే ఇంకొందరు పాములు అక్కడ ఉన్నాయి అని తెలియక వాటి కాటుకి కూడా బలవుతున్నారు. అందుకే కచ్చితంగా మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
అమెరికా జార్జియాలోని అగస్టా ప్రాంతంలో ఇళ్లు ఉంది. ఆ ఇంట్లో బెడ్‌రూమ్‌లో మకాం వేసిన పాము 18 పిల్లలను పెట్టింది. . ఆ ఇంటి మహిళ బెడ్ రూమ్ క్లీన్ చేస్తుండగా బెడ్ కింద భారీ పాముతో పాటు 18 పాము పిల్లలు ఉండటాన్ని గమనించింది. వెంటనే అరుపులు అరిచింది. అయితే వాటిని చూడకుండా ఆమె తాడు ముక్క అనుకుంది. కాని తర్వాత చూస్తే అవి పాము పిల్లలు అని తెలిసింది.
విల్చర్ తన భర్త మాక్స్‌కు ఈ విషయం చెప్పింది. ఒక పరికరం సహాయంతో ఆ పాములను సంచిలో వేసి.. నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. మొత్తానికి ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో తెలిపింది. సో ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖాళీ ప్రదేశాల పక్కన ఇళ్లు ఉన్న వారు కొంచెం జాగ్రత్త అని తెలిపింది.