ఐదుగురు అక్కాచెల్లెళ్లు కలెక్టర్లే

Five sisters are collectors in agriculture family

0
34

ఇప్పుడు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు సమానంగా ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు. దేశాలకు ప్రధానులు, అధ్యక్షులు అవుతున్నారు. పెద్ద పెద్ద MNC కంపెనీలను నడుపుతున్నారు. చైర్మన్లు, డైరెక్టర్లు, సీఈవోలు అవుతున్నారు. ఇక ప్రభుత్వ కొలువుల్లో కూడా సమానంగా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. తాజాగా ఓ రైతు ఇంట పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఐదుగురు కూతుర్లు ఓ గొప్ప కీర్తి తెచ్చి పెట్టారు ఆ తండ్రికి.

రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ కు చెందిన సహదేవ్ సహరన్ ఓ రైతు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు. వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ కుమార్తెలందరినీ బాగా చదివించాడు.ఐదుగురు కుమార్తెలు రాజస్థాన్ ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు ఈ వార్త దేశంలో అందరికి తెలిసి వారిని శభాష్ అంటున్నారు.

కొన్ని నెలల క్రితం రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి.
సహదేవ్ కుమార్తెలు రీతు, సుమన్, అన్షు ముగ్గురు ఈ ఉద్యోగాలు సాధించారు.మరో ఇద్దరు కుమార్తెలు రోమా, మంజు గతంలోనే ఆర్ఏఎస్ కొలువులు సాధించి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా ఐదుగురు పిల్లలు ఉన్నత ఉద్యోగాలు సాధించడంతో అందరూ వారిని అభినందిస్తున్నారు. ఆరైతు ఎంతో సంతోషంలో ఉన్నాడు.