చోరీ కేసును చేధించిన హైదరాబాద్ పోలీసులు

0
47

హైదరాబాద్​ కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వ్యాపారి దామోదర్‌ ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.28.90 లక్షల నగదు, రూ.71.10 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.