బ్రేకింగ్ – రాజ్ కుంద్రా గురించి షాకింగ్ విషయాలు చెప్పిన మోడల్ – లాక్ డౌన్ లో ఏం చేశారంటే

The Model Shocking Comments on Raj kundra

0
142

అందాల భామ శిల్పాశెట్టి భర్త మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాజ్ కుంద్రాని పోలీసులు అరెస్ట్ చేశారు. పోర్న్ చిత్రాలు నిర్మిస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి చిత్రాలు నిర్మించి పలు యాప్స్ లో వాటిని అప్ లోడ్ చేస్తున్నాడని తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇక ఎన్నో ఆరోపణలు గతంలో కూడా రాజ్ కుంద్రాపై వచ్చిన విషయం తెలిసిందే.

రాజ్ కుంద్రాపై గత ఫిబ్రవరిలో కేసు నమోదైందని తెలిపారు పోలీసులు. ఇక రాజ్ కుంద్రా అరెస్ట్ తో ఓ మోడల్ ఆమెకి జరిగిన ఓ సంఘటన గురించి చెప్పింది. సాగరిక సోనా సుమన్ అనే మోడల్ వీడియో ద్వారా తనకు జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది.

లాక్ డౌన్ సమయంలో తనకు వెబ్ సిరీస్ లో ఆఫర్ వచ్చిందని, అయితే ఈ ఆఫర్ విషయంలో ఆడిషన్ ఉందని రాజ్ కుంద్రా సిబ్బంది ఆమెకి తెలిపారట. ఆమె వీడియో కాల్ లో ఆడిషన్ లో పాల్గొంది. ఈ సమయంలో వీడియో కాల్ లో న్యూడ్ ఆడిషన్ చేయాలని అన్నారు. ఆ కాల్ లో రాజ్ కుంద్రా కూడా ఉన్నారట. కానీ మొహం కనిపించకుండా జాగ్రత్త పడ్డారని ఆమె అంది. నేను న్యూడ్ ఆడిషన్ అనగానే షాక్ అయ్యాను, నేను చేయను అని ఆమె చెప్పిందట. తాజాగా ఆయన అరెస్ట్ తో ఈ విషయం చెప్పింది ఈ మోడల్.