అడవికి సింహం రాజు. అది వస్తోంది అంటే దాని ముందుకు వెళ్లడానికి కూడా ఎవరైనా జంకుతారు. సింహంతో పులితో వేట ఆట ఎవరూ ఆడరు. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటం అనే చెప్పాలి. అడవిలో చిన్న జంతువులు సింహాన్ని ఆమడదూరం నుంచి చూస్తేనే పరుగులుపెడతాయి. ఇక ఇక్కడ వీడియోలో చూస్తే సింహాన్ని ఓ ముంగీస ముప్పు తిప్పలు పెట్టింది.
దానిని భయపెట్టి బెదరగొట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చిన్న జంతువు కదా అని సింహం ముందు దానిని పట్టించుకోలేదు. కానీ అది సింహానికే ఎదురు వెళ్లింది. చివరకు సింహం అయితే దాన్ని ఏం చేయకుండా వెనక్కి వెనక్కి వెళ్తూ బెదిరిపోయింది.
కానీ చివరకు తన పంజాతో ముంగీసని తలపై కొట్టింది ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది మరి ఆ వీడియో చూద్దాం.
— African animals (@AfricanimaIs) July 22, 2021