ఫామ్‌హౌస్‌లో పేకాట కలకలం..వెలుగులోకి విస్తుపోయే నిజాలు..

The poker commotion in the farm house..the facts that light up ..

0
85

హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట కలకలం రేపింది. అక్కడ మినీ క్యానినోను తలపించే రేంజ్‌లో కొనసాగుతున్న జూదాన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. బ్యాన్‌ ఉన్న ఆటకు అడ్డాను సృష్టించడంతో నాగశౌర్యకు నోటీసులివ్వనున్నారని తెలుస్తోంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే..ఒక్క ఈ ఫామ్‌ హౌస్‌లోనే కాదు.. శివారుల్లోని అనేక ఫామ్ హౌస్‌ల్లో ఇదే దందా జరుగుతున్నట్లు సమాచారం. నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో ఆట నడుపుతున్న నిర్వాహకుడు గుత్తా సుమంత్‌ విచారణలో ఈ విషయాలు బయటకు వస్తున్నాయి.

ప్రతీ ఫామ్‌హౌస్‌కీ ఒక్కో వాట్సాప్‌ గ్రూప్ క్రియేట్ చేసినట్లు సమాచారం. ప్రతీ వాట్సాప్‌ గ్రూప్‌లో 200 మంది వరకూ జూదగాళ్లు ఉన్నారట. అందరూ బడాబాబులే అని తెలుస్తోంది. చిప్స్‌తో నడిచే ఈ దందాలో కార్డులు తెస్తే స్వైపింగ్ చేసుకోవచ్చు. కార్డు లేకపోతే లిక్విడ్ క్యాష్‌తో రావచ్చు.  అయితే ఆ పేకాట వ్యవహారంతో తనకు ఏం సంబంధం లేదని నాగశౌర్య చెబుతున్నారు. అది తన తండ్రి పేరు మీద ఉందని.. అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదంటున్నారు. పోలీసుల విచారణలో అసలు నిజాలు తెలియనున్నాయి.

అయితే ఫామ్‌హౌస్‌ పేకాట వ్యవహారంలో కొత్తగా బుజ్జి అనే వ్యక్తి బయటకి వస్తోంది. ఈ బుజ్జి ఎవరో కాదు. నాగశౌర్యకు బాబాయి. అంటే ఫామ్‌హౌస్‌ లీజ్ అగ్రిమెంట్‌ నాగశౌర్య తండ్రి రవీంద్రప్రసాద్‌ పేరు మీద ఉంటే..ఫామ్‌హౌస్ కార్యకలాపాన్నీ బాబాయి బుజ్జీ చూసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే కేసులో 20 మంది ప్రముఖులు పోలీసుల లాకప్‌లో ఉన్నారు.