సాధారణంగా టాయిలెట్ కు వెళ్లిన సమయంలో కచ్చితంగా ఫ్లష్ చేసుకుని కూర్చోవాలి. ఎందుకంటే లోపల ఏ పాము ఉంటుందో, ఏ పురుగు ఉంటుందో తెలియదు కదా. అయితే పాములు ఇటీవల ఇలాంటి ప్రాంతాల్లో కాచుకు కూర్చుంటున్నాయి. దీని వల్ల చాలా మంది గాయాలపాలవుతున్నారు.తాజాగా ఆస్ట్రియాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
గ్రాజ్లో నివసిస్తున్న 65 ఏళ్ల పెద్దాయనకు అర్జంట్గా మూత్రం వచ్చింది.ఇంట్లోని వెస్ట్రన్ టాయిలెట్లోకి వెళ్లాడు. కబోర్డులో మూత్రం పోస్తుండగా అందులో నుంచి ఓ కొండచిలువ బయటకు వచ్చింది. అతను ఏదో ఆలోచిస్తూ కింద చూడలేదు . దీంతో అది నేరుగా అతని మర్మాంగాన్ని పట్టుకుంది. దీంతో కేకలు పెట్టాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాధితుడికి దాని పంటి గాయాలు మాత్రమే అయ్యాయని వైద్యులు తెలిపారు.
అతడి ఇంటి పక్కనే నివసిస్తున్న 24 ఏళ్ల యువకుడు 11 పాములను పెంచుతున్నాడు. అందులో ఓ పాము ఇలా వీరి బాత్రూమ్ లోకి వచ్చింది. ఆ మూత్రం పోయడంతో అతన్ని అక్కడ పట్టుకుంది. చివరకు ఆ వ్యక్తి వచ్చి ఆ పాముని తన ఇంటికి తీసుకువెళ్లాడు.