విషాదాన్ని మిగిల్చిన అకాల వర్షాలు..పిడుగుపాటుకు యువకుడు బలి

0
104

ప్రస్తుతం అకాల వర్షాలు, మెరుపులు, ఉరుముల సంభవిస్తున్న క్రమంలో ప్రజలు అడుగు బయట పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. అందరు భయపడిన విధంగానే పిడుకు కాటుకు వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా పిడుగుపాటుకు ఓ యువకుడు  బలయ్యాడు. మాడగడ పంచాయతీ పరిధి మెచ్చగూడ గ్రామానికి చెందిన పెట్టెలి రవికుమార్ అనే యువకుడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

పర్యాటక కేంద్రమైన అరకులోయ పట్టణ పరిసర ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో రవికుమార్ అనే యువకుడిపై పిడుగు పడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకి గురయ్యి..కొన ఊపిరి ఉన్నయువకుడిని ఆలస్యం చేయకుండా అరకు ఆస్పత్రికి తరలించారు. కానీ అంతలోనే ఆ యువకుడు మృతిచెందినట్టు వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు రోదనకు గురయ్యారు.