Flash- దారుణం..పసికందుతో సహా కుటుంబం మొత్తం ఆత్మహత్య..

The whole family, including the baby, committed suicide.

0
83

మూడు నెలల పసికందుతో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన కర్ణాటక గడగ్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

నాగేంద్రగడ గ్రామంలో మల్లప్ప(30), ఆయన భార్య సుధా గడాడ్(24)​తో కలిసి నివసిస్తున్నాడు. వీరిరువురు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి మూడు నెలల పాప (రూపశ్రీ) కూడా ఉంది. వీరందరూ ఊరి చివర ఉన్న తమ ఫామ్​ హౌస్​లో ఉరి వేసుకుని మృతి చెందారు.

మల్లప్ప హాల్​లో ఉరి వేసుకోగా..సుధ, కూతురు బెడ్​రూమ్​లో శవాలుగా కనిపించారు. కుటుంబ కలహాల వల్లే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.​ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.