ఘోర రోడ్డు ప్రమాదం..భర్త ఒడిలో తుదిశ్వాస విడిచిన భార్య

0
119

తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్ని కఠిన చర్యలు చేపట్టిన రూల్స్ మాత్రం పాటించడం లేరు కొందరు దుర్మార్గాలు. ఇప్పటికే ఇలాంటి హృదయ విదారక ఘటనలు ఎన్నో చోటుచేసుకున్న మానవత్వం లేని మనుషుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్​ శివారు అబ్దుల్లాపూర్​మెట్​లో ఘోర ప్రమాదం జరిగింది.

వివరాల్లోకి వెళ్ళితే.. గంగనమోని శ్రీనివాస్‌ తన భార్య జయమ్మతో బండరావిరాలకు ఎంతో సంతోషంగా వెళుతూ అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతానికి చేరుకున్నారు. అంతలోనే వెనుక నుండి వేగంగా వచ్చిన ఓ కారు బైక్ ను బలంగా ఢీకొనడంతో ఇద్దరు దంపతులకు తీవ్ర గాయలయ్యి రక్తమడుగులో పడి ఉన్నారు.

ఈ ప్రమాదంలో భర్తకు స్వల్ప గాయాలు కావడంతో..దూరంగా పడివున్నభార్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఒడిలోకి తీసుకున్నాడు. అప్పటికే భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో అతని వడిలోనే తుది శ్వాస విడవడంతో భర్త బోరుమని ఏడ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.