ప్రేమించిన యువతి దక్కలేదని..యువకుడి ఘాతుకం

The young woman he loved did not get it

0
91

హైదరాబాద్​లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనతో పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి చేశాడు యువకుడు. ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ప్రేమించి పెండ్లికి నిరాకరించిందన్న కోపంతో శిరీష అనే యువతిపై బస్వరాజు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. హస్తినపురంలోని యువతి ఇంట్లోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసినట్లు తెలుస్తుంది. శిరీష పరిస్థితి విషమంగా ఉండడంతో నవీన హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది. దాడి చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.