సరస్సు చూసేందుకు వెళతారు కాని ఎవరూ దిగరు – దీని చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు

There is a big story behind this lake

0
95

మన దేశంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇతర దేశాల నుంచి వీటిని చూసేందుకు లక్షలాది మంది వస్తూ ఉంటారు.
పర్వతాలు, అడవులు, లోయలు, సరస్సులు, కోటలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ ప్రాంతం గురించి చెప్పుకోబోతున్నాం. భారత్- మయన్మార్ సరిహద్దుల్లోని ఒక సరస్సు ఉంది. ఇది పెద్ద మిస్టరీ సరస్సు
దీనిని లేక్ ఆఫ్ నో రిటర్న్ అని పిలుస్తారు.

ఈ సరస్సు వెనుక ఓ పెద్ద కథ చెబుతారు. అరుణాచల్ ప్రదేశ్లో ఉంది ఈ సరస్సు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ పైలట్లు ఇది ఓ చదునైన మైదానంలా ఊహించుకుని ఇక్కడ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారట.
కానీ తర్వాత వారు ఆ విమానంతో కనిపించలేదు . తర్వాత వారిని వెతుకుతూ వచ్చిన వారి ఆచూకి దొరకలేదు.

ఈ సరస్సు పై సినిమాలు, స్టోరీలు చాలా వచ్చాయి. అందుకే ఈ సరస్సును Mystery of Indian Bermuda అని, Lake of No Return అని పిలుస్తున్నారు. అయితే సరస్సుని చాలా మంది చూస్తారు కాని ఈ కథనాలు వార్తలు అనేకం రావడంతో ఎవరూ దీనిలోకి దిగరు అక్కడ చూసేందుకు వందలాది మంది వస్తారు.