పియర్స్ పండ్లు తింటే కలిగే లాభాలు తెలుసా

Do you know the benefits of eating Pierce fruits?

0
40
Pierce fruits

పియర్స్ పండ్లు పెద్దగా ప్రజలు తినేందుకు ఆసక్తి చూపించరు. కాని రుచి చాలా బాగుంటుంది. వీటిని మన తెలుగులో బేరి పండు అంటారు. ఇది తియ్యగా ఎక్కువ ఫైబర్ ఉండే పండు. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి.
డయాబెటిస్ పేషెంట్లు దీన్ని చక్కగా తినవచ్చు. హార్ట్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు ఇది తింటే బరువు పెరగరు. ఇక మలబద్దక సమస్యలు ఉండవు తొందరగా ఆకలి వేయదు.

పియర్స్ పండుని మందుల తయారీలోనూ వాడుతున్నాయి పలు కంపెనీలు. ఈ పండ్లలో విటమిన్ A కూడా ఉంటుంది.
పియర్స్ లో రాగి, కాల్షియం, పాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. దీని వల్ల ఎముకలు చాలా బలంగా తయారు అవుతాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది బాడీలో వేడిని ఈ పండ్లు తగ్గించేస్తాయి.

ఇవి ఎర్రరక్త కణాల సంఖ్యని పెంచుతాయి. నీరసం తగ్గిస్తుంది. ఈ ఫ్రూట్ లో విటమిన్ సీ ఉంటుంది. ఈ పండు తినడం వల్ల మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని తేలింది. ఈ పండ్లలో ఫైబర్ ఉండటం వల్ల చాలా మంది వైద్యులు కూడా తీసుకోమని చెబుతారు. అయితే ఈ పండ్లు మితంగానే తీసుకోవాలి అతి ఏదైనా ప్రమాదమే, అందుకే తక్కువగా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.