బ్రేకింగ్ న్యూస్- ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్..ముగ్గురు అరెస్ట్

Three arrested for smuggling red sandalwood in AP

0
130

ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ కలకలం రేపింది. చిత్తూరు జిల్లా పీలేరులో శుక్రవారం తెల్లవారుజామున రెండు ఇన్నోవాలతో సహా ఎర్రచందనం రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎర్రచందనం తరలిస్తున్న వాహనాలతో పాటు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన స్మగ్గర్లలో చంద్రగిరి నియోజకవర్గం, చిన్నగొట్టిగల్లు జడ్పిటిసి భర్త మహేశ్వర్ రెడ్డి, అతని అనుచరులు మునీశ్వర్, కృష్ణయ్య ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికార పార్టీ నేత ఎర్రచందనం స్మగ్లింగ్ లో పట్టుబడడంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తుంది. మీడియాను సైతం పోలిసులు అనుమతించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.