ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం హుకుంపేట వద్ద విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. మృతులు ధవళేశ్వరానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు స్నేహితులున్నట్లు సమాచారం.