Flash: వైద్యుల నిర్లక్ష్యానికి కడుపులో పసిబిడ్డ కన్నుమూత..

0
142

తెలంగాణాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కడుపులో బిడ్డ కన్నుమూసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. మల్దకల్ మండలం మద్దెల బండ తండాకు చెందిన వెంకటమ్మ నొప్పులు వస్తున్న క్రమంలో హుటాహుటిగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు.

అనంతరం పరీక్షలు నిర్వహించిన వైద్యులు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పిన కొంతసేపటికి వెంకటమ్మ నొప్పులు అధికంగా రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యి వైద్యులను సంప్రదించారు. దాంతో వైద్యులు శస్త్ర చికిత్స చేస్తుండగా కడుపులో బిడ్డ మరణించడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.