తీవ్ర విషాదం: ప్రమాదం ఒక్కటే – ప్రాణాలే నలుగురివి!

0
92

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌లో ఈ రోజు ఉద‌యం కారు అదుపు త‌ప్పి డివైడ‌ర్ ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో చిన్నారితో సహా నలుగురు అక్క‌డిక్క‌డే మృతి చెందారు. కాగా ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు ఏంటని దర్యాప్తు చేస్తున్నారు.