నాగబాబు సంచలన ట్వీట్..జనసేనకు రిజైన్ చేయనున్నారా?

0
42

నాగబాబు అంటే తెలియనివారుండరు. సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు  తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు, నిర్మాతగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నాడు. ఈయన చాలా సినిమాల్లో సహాయ నటుడిగానూ, కొన్ని సినిమాల్లో హీరోగాను కూడా నటించారు.

ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు అప్పుడప్పుడు వివాదాస్పద మాటలతో వార్తల్లోకి వచ్చేవారు. అప్పట్లో మా ఎన్నికలు, అలాగే ఏపీ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తూ.. హాట్‌ టాపిక్‌ గా మారిన సంగతి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే ఇంకోపక్క తమ్ముడు పవన్ జనసేన పార్టీలో కీలక బాధ్యతలు వహిస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీలో వివాదాలకు ఘాటుగా స్పందించే వ్యక్తి నాగబాబు మాత్రమే. ఇక తాజాగా ఆయన సోషల్ మీడియా లో ఒక పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.

” ఇన్నాళ్ల నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసి, ఎన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒక రకంగా చూస్తే ఈ ఆపదలు మరియు కష్టాలే నన్ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి ఎంతగానో సహాయపడ్డాయి. నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా ప్రజలకు సహాయ పడాలని నిర్ణయించుకొని అదే గమ్యంగా నా లక్ష్యం వైపు పయనించాను. ఈ పయనంలో నాకు ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైనా, కానీ.. నన్ను ప్రతిసారి వెన్నంటి నడిపించి నాకు మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలే.. అందుకే ఇప్పటి నుంచి నా పూర్తి సమయాన్ని నా గమ్యం దిశగా ప్రయాణం కొనసాగించడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకొస్తా.. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు నాగబాబు రాజకీయాలకు దూరమవుతున్నాడా..? సినిమాలకు దూరమవుతున్నాడా? జనసేనకు రిజైన్ చేయబోతున్నారా? అని కామెంట్స్ పెడుతున్నారు.