దుర్గాదేవి ఊరేగింపులో విషాదం..నలుగురు మృతి

Tragedy in Durgamata Shobhayatra..Car that crashed into devotees

0
41

ఛత్తీస్ ఘడ్, జష్పూర్ దుర్గాదేవి ఊరేగింపులో ఓ కారు హల్ చల్ చేస్తుంది. గంజాయితో వెళ్తున్న కారు దుర్గమ్మ భక్తులపై నుండి దూసుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 26 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిలో వెనుక నుండి వస్తున్న కారు భక్తులను ఢీకొట్టి అలానే ముందుకు దూసుకుపోయినట్టు ఉంది.

ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో ఒక మతపరమైన ఊరేగింపులో ప్రమాదం జరగడం చాలా విచారకరమని తెలిపారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.