తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భీంపూర్ గ్రామానికి చెందిన ఓ విద్యార్థి ప్రైవేట్ స్కూల్ లో LKG చదువుతుంది. కాగా నిన్న ఆదివారం స్కూల్ లేకవపోవడంతో ఇంటి వద్దే ఆడుతూ పాడుతూ గడిపింది. ఈ క్రమంలో ఓ బాటిల్ లో ఉన్న పురుగుల మందును చూసి కూల్ డ్రింక్ అనుకొని తాగేసింది. దీనిని గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందింది. ముక్కుపచ్చలారని చిన్నారి మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.