బ్రేకింగ్: మహబూబాబాద్ జిల్లాలో విషాదం..బాలుని ప్రాణం తీసిన విద్యుత్ కంచె

0
98

మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్ కంచె కారణంగా నిండు ప్రాణం బలయిపోయింది. వివరాల్లోకి వెళితే..కేసముద్రం మండలంలో ఓ రైతు తన పొలాన్ని కోతుల నుండి కాపాడుకోవడం కోసం పొలం చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేసాడు. కానీ ప్రమాదవశాత్తు ఈ తీగలు జీవన్(15) అనే బాలుడికి తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.