Flash News- పోలీసు శాఖలో విషాదం..మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

Tragedy in the police department .. Suspicious death of a female constable

0
129

ఏపీ పోలీసు శాఖలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ పోలీసు కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి చెందింది. మచిలీపట్నంలో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తన్న ప్రశాంతి ఆత్మహత్యకు పాల్పడిందని సోలీసులు తెలిపారు. తన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె మృతి పట్ల కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.