Flash: ఘోర ప్రమాదం..కుమార్తె జన్మదినం రోజే..తల్లిదండ్రులు మృత్యువడికి

0
31

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుమార్తె పుట్టినరోజే తల్లితండ్రులు మృత్యువడికి చేరుకున్న విషాద ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరు దంపతులు బుధవారం తమ కుమార్తె జన్మదినం కావటంతో హాస్టల్‌లో వేడుకలు జరిపి తిరిగి గజ్వేల్‌కు వస్తుండగా  ప్రజ్ఞాపూర్‌ రాజీవ్‌ రహదారిపై రాణె ఫ్యాక్టరీ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో మరో కారుకు తగిలింది.

ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మరణించాగా..మరోకారులో వెళ్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. దాంతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనలో తన తల్లితండ్రులు మృతిచెందడంతో కుమార్తె కన్నీరు మున్నీరు చేసుకుంది.