Flash News: ఏపీలో విషాద ఘటన..పాముకాటుతో అర్చకుడు మృతి

0
96

ఏపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుడిదిబ్బ గ్రామానికి చెందిన కొండూరి నాగబాబు శర్మ గత కొంతకాలంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అయితే ఇతనికి పాములు పట్టి దూరంగా వదిలేసే అలవాటు ఉంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న కృతివెన్ను పీతలావ గ్రామ రైతులు శనివారం నాడు నాగబాబు శర్మను  పామును పట్టుకోవడానికి తీసుకువెళ్లారు.

పట్టుకున్న పామును నివాసాలకు దూరంగా తీసుకెళ్లే సమయంలో అది నాగబాబుశర్మ చేతిపై కాటు వేసింది. దీంతో నాగబాబుశర్మను ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత వైద్యులు ఆయన్ను పరిశీలించి చికిత్స చేస్తుండగా మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.