రోజురోజుకు అధికారుల్లో లంచగొండితనం పెరిగిపోతుంది. ఏ పని చేయించుకోవాలన్నా పైసలు పెట్టాల్సిందే. పోలీస్ స్టేషన్ నుండి మొదలు ఎమ్మార్వో ఆఫీస్ ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు సామాన్యుల నుండి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా సూర్యాపేట రూరల్ ఎస్ఐ లవకుమార్ ఏసీబీకి రెడ్ హ్యా౦డెడ్ గా దొరికిపోయారు.
“రాజుగారితోట” హోటల్ యజమాని నుంచి రూ 1.30 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడగా.. నిన్ననే లవకుమార్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే బదిలీకి ముందు జేబు నింపుకునే క్రమంలో ఏసీబీకి లవకుమార్ అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం పీఎస్ లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.