Flash- సిరియాలో జంట పేలుళ్లు కలకలం..13 మంది మృతి

Twin blasts kill at least 13 in Syria

0
71

సిరియాలో భారీ పేలుడు సంభవించింది. రాజధాని దమాస్కస్​లో జరిగిన ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. భద్రతా దళాలే లక్ష్యంగా దుండగులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

బలగాలను తరలిస్తున్న సైనిక వాహనం సమీపంలో ఈ జంట పేలుళ్లు సంభవించాయి. పేలుడు సంభవించిన సమయంలో ఆ ప్రాంతం రద్దీగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. దమాస్కస్ ప్రభుత్వం అధీనంలోకి వచ్చాక ఆ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు జరగడం ఇదే తొలిసారి.