అయ్యప్ప మాలధారణలో వచ్చి దొంగతనం…దేహశుద్ది చేసిన గ్రామస్థులు

Two arrested for burglary

0
86

తెలంగాణలో అయ్యప్ప మాలధారణలో ఉన్న స్వాములు దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామంలో వారం రోజుల క్రితం అయ్యప్ప వేషధారణలో ఉన్న ఇద్దరు స్వాములు గ్రామానికి వచ్చి కిరాణా షాపులో మహిళను కలిశారు. ఆమెకు దోషం ఉందని నమ్మబలికి ఒక తాయత్తు కట్టారు.

ఆమె మైకంలోకి జారుకున్న తర్వాత షాపులో ఉన్న నగదు, కిరాణా సామగ్రి తీసుకుని పరారయ్యారు. ఈరోజు ఉదయం మళ్లీ అయ్యప్ప మాలధారణలో ఉన్న ఇద్దరు అపరిచిత వ్యక్తులు గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమందించి గ్రామ పంచాయితీ కార్యాలయంలో బంధించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేసి యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

పవిత్రమైన మాల ధరించి అమాయకుల వద్ద అందినకాడికి దోచేస్తున్నారు. పూజలు, దోషాల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కాసులు దండుకుంటున్నారు. కానీ వీరి ఆటలు సాగలేదు. చివరకు కటకటాల పాలయ్యి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వీరు చేసే పనులకు ఆ మాలను అడుపెట్టొకొవడం కూడా తప్పే కదా. ఇలాంటి వారిని మీరు నమ్మి మోసపోకండి.