Breaking News- రైలు ద్వారా గంజాయి స్మగ్లింగ్..ఇద్దరు అరెస్ట్

Two arrested for smuggling cannabis by train

0
34

ట్రైన్ ద్వారా కావాల్సిన వారికి గంజాయిని సప్లయి చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఒక మహిళతో సహ మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. అరెస్టు చేసిన ఇద్దరు స్మగ్లర్ల నుండి మూడు లక్షల ఇరువై వేల రూపాయల విలువైన 32 కిలోల గంజాయితో పాటు, రెండు సెల్ ఫోన్లను టాస్క్ఫో ర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితులు వివరాలు ఇలా ఉన్నాయి. 1.ద్వారపూడి మణికూమార్ అలియాస్ దుర్గా, వయస్సు 21, పెద్దగోల్లపాలెం గ్రామం, ఎరమంచలి మండలం, విశాఖపట్నం జిల్లా, ఆ.ప్ర జిల్లా. 2. బానోత్ బిచ్యా,వయస్సు 34, తోవనగడ్డ తండా, చెన్నారావుపేట మండలం, వరంగల్ జిల్లాకు చెందిన వారు కాగా ప్రస్తుతం పరారీలో వున్నవారు విశాఖపట్నం చెందిన వాడు ప్రధాన నిందితుడు గోడి శంకర్‌రావు మహిళా నిందితురాలు ధరావత్ మహేశ్వరీ అలియాస్ రేష్మా మల్లంపల్లి, ములుగు జిల్లాకు చెందిన వారు వున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ..పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు ద్వారపూడి మణికుమార్‌కు వరుసకు మామయ్య అయిన ప్రధాన నిందితుడు శంకర్ రావు (ప్రస్తుతం పరారీలో వున్నాడు) విశాఖపట్నం జిల్లాలోని డౌనూరు, చింతపల్లి, నర్సీపట్నం ప్రాంతాల నుండి సేకరించిన గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసిన వాటిని రెండు కిలోల చొప్పున ప్యాకింగ్ చేసిన గంజాయి ప్యాకేట్లను అరెస్టు చేసిన ఇద్దరు నిందితులతో పాటు ప్రస్తుతం పరారీలో వున్న మహిళా నిందితురాలు మహేశ్వరీకి ఇచ్చి రైలు ద్వారా మహరాష్ట్ర, ములుగు, నర్సంపేట ప్రాంతాలకు చేరవేసేవారు.

నిందితులు గంజాయి స్మగ్లింగ్ చేసే సమయంలో ఎవరికి అనుమానం కలగకుండా వుందేండుకుగాను గంజాయిని ఖరీదైన బ్యాగుల్లో భద్రపర్చి ఏసి బోగీల్లో ప్రయాణించేవారు. ఈ తరహలో నిందితులు గత నాలుగు సంవత్సరాలు గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ రోజు నిందితులు గంజాయి అందజేసేందుకుగాను వరంగల్ రైల్వే స్టేషన్ బయటకి వచ్చిన నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోని వారిని తనీఖీ చేయగా వారి వద్ద గంజాయి లభ్యం కావడంతో నిందితులను అరెస్టు చేసి ఇంతేజా గంజ్ పోలీస్ స్టేషను తరలించారు.

ఈ నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎ.ఎస్పీ వైభవ్ గైఖ్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ జీ, సంతోష్, ఇంతేజా గంజ్ ఇన్స్పెక్టర్ మల్లేషం, ఎస్.ఐ స్వామి, టాస్క్ఫ ర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, కానిస్టేబుళ్ళు ,శ్రీకాంత్, సృజన్, మహేందర్, శ్రీనివాస్, ఆలీ, చిరులను పోలీస్ కమిషనర్ అభినందించాడు.