మహిళలపై, చిన్నారులపై, దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకోగా..తాజాగా సికింద్రాబాద్ లో కూడా ఇలాంటి ఘటనే ఇద్దరు అమ్మాయిల జీవితాలను అంధకారం చేసింది.
వివరాల్లోకి వెళితే..సికింద్రాబాద్ లోని చిలకలగూడ పరిధిలో మరో దారుణం చోటుచేసుకుంది. నావాజ్, ఇంతియాజ్ అనే ఇద్దరు యువకులు తమ కౄరత్వంతో మైనర్లపై అత్యాచారానికి ఒడిగట్టారు. అక్క, చెల్లెల్ని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్న ఈ దుండగులు ప్రేమ పేరుతో ఇద్దరిని మోసం చేసారు. అనంతరం తల్లిదండ్రులు పోలీసులకు ఈ ఘటనపై 2 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నట్లు పిర్యాదు చేసారు. దాంతో పోలీసులు ఇద్దరు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.