వీరిద్దరూ భార్యాభర్తలు. భర్తపేరు చందన నాగ రవిరాజా, భార్యపేరు చందన సునీత అలియాస్ అనూష. వీరు ఈజీ మనీ కోసం అలవాటు పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నివాసముంటున్నారు.
వీరు ఈజీ మనీ కోసం కాలేజీ యువతకు వలపు వల విసురుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆంధ్రా నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీరి ఆగడాలు మితిమీరడంతో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి మోసకారి జంటను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీరిపైన పిడి యాక్ట్ కూడా నమోదు చేశారు. వీరిద్దరికీ సపోర్టు చేస్తున్న మరో మహిళ రేఖ అనే మహిళ పైనా కేసు నమోదైంది.