22 లక్షలు వసూలు చేసి డెడ్ బాడీ ఇచ్చారు : యశోద ఆసుపత్రిపై హెచ్.ఆర్.సి లో ఫిర్యాదు

Complaint in HRC against Yashoda Hospital

0
120

తెలంగాణలో పేరుగాంచిన యశోద ఆసుపత్రి యాజమాన్యంపై ఒక యువకుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. తన తండ్రి మరణానికి కారణమైన యశోద ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాలు…

హైదరాబాద్ లోని గాంధీనగర్ లో నివాసం ఉంటున్న పురుషోత్తం యాదవ్ కరోనాతో కరోనాతో ఏప్రిల్ 13వ, 2021న మరణించాడు. యశోద ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి మరణించాడని ఆయన తనయుడు ప్రవీణ్ యాదవ్ ఆరోపించారు. తన తండ్రి పురుషోత్తం యాదవ్ మరణానికి కారణమైన యశోద హాస్పటల్ యాజమాన్యంపైనా, డాక్టర్ల పైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రవీణ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ 29 రోజులు యశోద ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ పరుతో 22 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. చనిపోయిన తన తండ్రి మృతదేహాన్ని అప్పగించడానికి 6లక్షల 80వేల రూపాయలు వసూలు చేశారని తెలిపారు.

అడ్మిట్ అయిన మూడు రోజులు ఎలాంటి ట్రీట్ మెంట్ చేయలేదని, రెమిడెసివీర్ లాంటి ఇంజెక్షన్ కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో క్రిటికల్ కండిషన్ కి వెళ్లారని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితదని చెబుతున్నారని ఆరోపించారు. తక్షణమే యశోద ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని వినతిపత్రంలో విన్నవించారు.

ప్రవీణ్ యాదవ్ మీడియాతో మాట్లాడిన వీడియో చూడండి…https://fb.watch/69ExYVL4bW/

https://fb.watch/69EzrZEZSz/