భూములు అమ్ముకుని పెళ్లానికి పట్టుచీర కొన్నట్లు : కొండా చురక

Ex Mp Konda Vishweshwar Reddy Interesting Comments on Government Land Sales

0
42

ప్ర‌భుత్వ భూముల అమ్మ‌కాల‌పై చేవెళ్ల మాజీ టిఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ విషయమై బుదవారం ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఉన్న వివరాలు…
విద్యా, వైద్య‌రంగాన్ని నిర్ల‌క్ష్యం చేశారు.
ప్రైవేటు టీచ‌ర్ల‌కు 2వేలు, బియ్యం అంద‌డంలేదు.
రైతుల క‌ష్టాలు ప‌ట్ట‌వు. ధాన్యం కొనుగోలు చేయ‌రు.
విద్యారంగానికి, వైద్యరంగానికి పైస‌ల్లేవు.
ఆర్థికంగా మిస్ మేనేజ్మెంట్ అయ్యింది.
అద‌న‌పు క‌లెక్ట‌ర్ల‌కు కియా కార్లు కొన‌డం స‌మంజసమా?
ధ‌నిక‌రాష్ట్రంలో భూములు అమ్మ‌కోవ‌డం ఏంది?
ఇలాంటి పరిస్థితి వస్తుందని ఉద్య‌మ‌కారులు, అమ‌ర‌వీరులు ఎవ్వ‌రూ ఊహించుకోలేదు.
ఇది నిజంగా ద్రోహ‌మే.

తెలంగాణ‌కు అంతా అన్యామే అవుతుంటే.. మా రంగారెడ్డిజిల్లాకు మ‌రింత అన్యాయం అవుతుంది.
భూములు అమ్ముకొని పెళ్లానికి ప‌ట్టుచీర కొన్న‌ట్లు ఉంద‌ని మా ఊర్లో అనుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లా లోని భూములు అమ్మిన పైస‌లు రంగారెడ్డి జిల్లాకే ఖ‌ర్చుపెట్టాలి.
రంగారెడ్డి జిల్లాలో వ‌చ్చిన పైస‌లు రంగారెడ్డి జిల్లా ప్ర‌జ‌ల సంక్షేమానికి ఖ‌ర్చుపెట్ట‌డంలేదు.
భూములన్నీ రంగారెడ్డి జిల్లావి, కానీ నీళ్లు, నిధులు మాత్రం ఇంకెక్క‌డికో పోతున్నాయ్.
మొత్తం ఆదాయం కాక‌పోయిన కొంతైనా రంగారెడ్డి జిల్లాకు ఖ‌ర్చుపెట్టండి.
క‌నీసం ఒక మెడిక‌ల్ కాలేజ్ ఇస్తా అన్నారు. ఇవ్వ‌లేదు. తాండూరుకు రావాల్సిన మెడిక‌ల్ కాలేజ్ ఇంకెక్కడో పెడ్తున్నారు.

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల‌కు సిఎం బాగా దోఖా చేస్తున్న‌రు.
2023 లో ఉమ్మ‌డి రంగారెడ్డి, జిల్లా ప్ర‌జ‌లంతా మీకు వ్య‌తిరేకంగా ఓటు వేస్తరు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా టీఆర్ ఎస్ గెల‌వ్వ‌దు. అని హెచ్చరించారు కొండా.