Flash- ఏసీబీ వలలో గ్రామ రెవెన్యూ అధికారి

0
110

ఏపీ: విశాఖపట్నం జిల్లా చీడికాడ గ్రామ రెవెన్యూ అధికారి రాజు ఏసీబీ వలకు చిక్కాడు. చీడికాడ గ్రామానికి చెందిన సత్తిబాబు తన తండ్రికి సంబంధించిన భూమి యొక్క వివరాలు ఆన్లైన్ చేసి ఈ-పట్టాదార్ పాస్ బుక్ మంజూరు చేయాలని గ్రామ రెవెన్యూ అధికారి రాజును అడిగాడు.

దానికి వీఆర్వో రూ.30 వేలు లంచంగా అడిగాడు. దానికి ఒప్పుకున్న సత్తిబాబు గురువారం మధ్యాహ్నం సుమారు 12.10 గంటలకు రాజుకు డబ్బులు ఇస్తుండగా..విశాఖపట్నం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.