Flash News- గ్రామ పంచాయతీలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

CM KCR good news for gram panchayats

0
35

తెలంగాణ: గ్రామ పంచాయతీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం కేసీఆర్ ప్రసంగించారు.

గత ప్రభుత్వాల హయంలో బడ్జెట్​ను ఎలా ఖర్చు పెట్టాలనే దానికి ప్రణాళికలు కూడా లేవని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాకా అంతా ప్రణాళికబద్ధంగా చేస్తున్నామన్నారు. త్వరలోనే తెలంగాణలో గ్రామ దవాఖానలు రాబోతున్నాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు.