నిరుద్యోగులకు అలర్ట్..ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

0
100

బ్యాంకులో ఉద్యోగం కోరుకునే వారికి శుభవార్త. ఐబీపీఎస్‌ భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉన్న 7800 క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 27 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

మొత్తం పోస్టులు: 7800 కాగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. అదేవిధంగా స్థానిక భాష రాయడం, చదవడం తెలిసి ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్‌ ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు రూ. 175.
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్‌ 7
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 27
ప్రిలిమ్స్‌ పరీక్ష: డిసెంబర్‌ 2021
మెయిన్స్‌: వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి
వెబ్‌సైట్‌: ibps.inను సంప్రదించండి.