ఈ కోబ్రా వీడియో చూస్తే వ‌ణికిపోతారు ఎంత వేగంగా వ‌చ్చిందో చూడండి

Watch the Cobra video and see how fast it gets traded

0
129

అక్క‌డ పాము ఉంది అనే మాట వింటేనే జ‌నం ప‌రుగులు పెడ‌తారు. కొంద‌రు పాము పేరు ఎత్తితేనే భ‌య‌ప‌డ‌తారు అది కాటు వేసింది అంటే అది విషం లేని పాము అయినా టెన్ష‌న్ మాములుగా ఉండ‌దు. పాము అంటే ఎవ‌రికి అయినా భ‌య‌మే. అయితే కింగ్ కోబ్రాలాంటి పాముల‌ని చూస్తే ఇక వ‌ణుకు మాములుగా ఉండ‌దు.

కింగ్ కోబ్రా విషం మనిషి శరీరంలో వేగంగా వ్యాపిస్తుందని మనందరికీ తెలుసు. అది కాటు వేసింది అంటే నిమిషాల్లోనే దానికి విరుగుడు మందు వేసుకోవాలి. అయితే పాములు ప‌ట్టే స‌మ‌యంలో కూడా స్నేక్ క్యాచ‌ర్లు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. వాటిని మ‌ళ్లీ అడ‌వుల్లో సేఫ్ గా వ‌దిలిపెడ‌తారు. కాని కొన్ని సార్లు అవి వారిని కూడా కాటు వేస్తాయి.

తాజాగా కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
స్నేక్ క్యాచర్స్ ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడిన కింగ్ కోబ్రాను పట్టుకోవాలని ప్రయత్నించాడు. దాని తోకను పట్టుకుని లాగాడు. ఇక అది చాలా పెద్ద‌ది బుస‌లు కొడుతూ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో అత‌ను కూడా షాక్ అయి దానిని వ‌దిలేశాడు. తృటిలో కోబ్రా కాటు నుంచి అతడు తప్పించుకున్నాడు మీరు ఈ వీడియో చూడండి.

https://twitter.com/i/status/1435091861304086532